పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మన అందరి బాధ్యత
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఎస్ఏపీ క్యాంప్ కట్టమంచి రామ లింగారెడ్డి మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో పృద్వి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏడు, ఎనిమిది ,తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణలో రీసైక్లింగ్ పాత్ర అనే అంశంపై చిత్రలేఖన పోటీలను లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ భాష మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ భావితరాలకు స్వచ్ఛమైన గాలి ,నీరు ,వాతావరణం అందించవలసిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎం.ఆర్.ఓ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మురారి శంకరశంకరప్ప ,ఉపాధ్యక్షుడు తిరుపతి సాయి ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .అనంతరం కె.ఎన్.ఆర్ పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో రీసైక్లింగ్ పాత్రఅంశంపై 7 ,8 ,9 విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు .లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అధ్యక్షత న జరిగిన ఈ వ్యాసరచన పోటీల కార్యక్రమ ప్రారంభంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ కార్యదర్శి గోపీనాథ్ ,డిఎస్పీ మహబూబాషా ,తిరుపతి సాయి తదితరులు పాల్గొన్నారు.