న్యాయవాదులపై జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న దాడులకు నిరసనలు
1 min read
త్వరలోనే న్యాయశాఖ మంత్రి కి వినతిపత్రాన్ని సమర్పిస్తాం
ఈనెల 9వ తేదీ వరకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతాయని స్పష్టం
ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారామారావు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారామారావు మాట్లాడుతూ ఇటీవల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న న్యాయవాదులపై జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న దాడులను ఖండించారు. దీనిపై త్వరలోనే న్యాయశాఖ మంత్రి కి వినతిపత్రాన్ని సమర్పిస్తామని తెలిపారు. ఈనెల 9వ తేదీ వరకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం తప్పనిసరిగా ఏర్పాటు చేసే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నిమ్మల జ్యోతి కుమార్ మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయని వీటన్నిటిని అరికట్టే విధంగా న్యాయవాదుల యాక్ట్ అమలు చేసేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ రిలే నిరాహార దీక్షలో అధిక సంఖ్యలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు.



