త్రాగు నీటిని అందించండి…
1 min read
గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్య
పట్టించుకోని అధికారులు
కౌతాళం, న్యూస్ నేడు: కౌతాళం మండలంలోని గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడింది. బాపురం , దమ్మలదిన్నె, అగసలదిన్ని, లింగాలదిన్నె , గుడికంబాలి, కౌతాళం లోని పింజారి వీధిలో 15 రోజులైనా తాగడానికి నీళ్లు రావడంలేదని మహిళల ఆరోపించారు.సోమవారం కాళి బిందెలతో మండల పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.ఎన్నికల వేళ 2 రోజులకు నీరు అందిస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు కనబడం లేదని మండిపడ్డారు. తినడానికి అన్నం పెట్టమని తాము అడగడం లేదని త్రాగునీరు అందించడని వాపోయారు. అన్ని వీధుల్లో ఇదే పరిస్థితిని వాపోయారు.అధికారులకు, నాయకులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదు,అని తెలిపారు.వర్షాకాలం, శీతాకాలం , వేసవికాలంలో ఇదే పరిస్థితిని ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. నీటి సమస్యని పరిష్కరించాలని కౌతాళం పంచాయతీ సెక్రెటరీ ప్రకాశం కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మహిళలు, కృష్ణవేణి, ఖాదర్ బి, హసీనా, జిలేక, రేష్మ, బీబీ, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.