NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నత్త నడకన సాగుతున్న రాజోలి ప్రాజెక్టు పనులు..

1 min read

చాగలమర్రి  న్యూస్​ (నేడు ): రాజోలి, జలదరాశి, కుందూ నదుల అనుసంధానంతో రాజోలి ప్రాజెక్టు పనులు 2019 నుండి కొనసాగుతోంది.  రాజోలు ప్రాజెక్టు ద్వారా రైతుకు సాగునీరు అందించేందుకు గతంలో ప్రభుత్వం పనులు ప్రారంభించడం జరిగింది. ప్రాజెక్టు పనులు చేసేందుకు ప్రభుత్వం టెండర్ ప్రకటించడం జరిగింది. మేడ, ఆర్కే ఆర్ , రిత్విక్ జాయింట్ కాంట్రాక్టర్లకు టెండర్ ద్వారా అప్పగించడం జరిగింది. రాజోలి, జలదరాశి, కుందూ నదులను అనుసంధానం చేస్తూ 2019లో టెండర్లు పిలిచారు. ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారంగా 850 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదించారని సంబంధిత అధికారులచే ప్రణాళిక సిద్ధం చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అంతేగాక కొన్ని గ్రామాలు కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నందున రైతులకు పరిహారం ఇచ్చేందుకు  గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. చిన్నముడియం, పాలూరు, బలపన గూడూరు, నెమళ్లదిన్నె, గలిసే నూరు గ్రామాలకు ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలను ఇచ్చేందుకు  ప్రభుత్వం కూడా ఒప్పుకుందనీ ఇందుకుగాను 250 కోట్లు కూడా పరిహారంగా ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వం సిద్ధం చేసింది. కానీ నత్త నడకన రాజోలి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి.

టీజీపీ డి ఈ వెంకటరమణ వివరణ..

పెండింగ్ లో ఉన్న టెండర్లను రద్దు చేయకపోవడం పనులు కొనసాగకుండా యధావిధిగా ఉన్నాయని తెలుగు గంగ ప్రాజెక్టు డి ఈ వెంకటరమణ తెలిపారు.

About Author