NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాఠశాల విద్య కమిటీ చైర్మన్‌గా రాసిపోగుల వెంకటేష్ ఏకగ్రీవ ఎన్నిక

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని వెంకట కొండాపురం గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాల విద్య కమిటీ (ఎస్‌ఎంసీ) చైర్మన్‌గా రాసిపోగుల వెంకటేష్, వైస్ చైర్మన్‌గా కొండా అరుణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా మంగళవారం  పాఠశాలలో నిర్వహించిన కమిటీ ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ నా పైన నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అప్పజెప్పినందుకు ముందుగా అందరికీ కృతజ్ఞతలు మీ నమ్మకాన్ని మమ్ము కాకోకుండా విద్య పట్ల, పాఠశాల పట్ల, ఉపాధ్యాయులకు సహా సహకారాలు అందిస్తూ విద్యార్థులకు విద్యని అందించేలా చూస్తూ పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకుని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author