NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మినీ గోకులంతో రైతుకు లాభదాయకం

1 min read

చాగలమర్రి  న్యూస్​ నేడు : మినీ గోకులం షెడ్‌ నిర్మాణం వల్ల పాడి రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని  టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు అన్సర్‌బాష,రాష్ట్ర మాంసమాభివృద్ది సంస్థ డైరెక్టర్‌ ముల్లా అజీం లు పేర్కొన్నారు. చాగలమర్రి పట్టణంలోని పాత గోపల్లె రస్తాలో పాడి రైతు రఫి నెర్మించుకున్న మినీ గోకులం షెడ్‌ను వారు శనివారం ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు అన్నిరకాలుగా అండగా ఉందన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మౌళాలి, జెట్టి నాగరాజు,నాగూర్‌,టైలర్‌ ఖాదర్‌,మహమ్మద్‌గౌస్‌,రాజేష్‌,బారిక్‌చామల్‌, అమీర్‌,మాభాష, మహబూబ్‌షరీప్‌,అక్బర్‌ తదితరులు పాల్గొన్నారు.

About Author