గ్రామాల్లో రిజర్వాయర్ – ప్రజలకు వివరంగా తెలపండి
1 min read– తహసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన వైసిపి నాయకులు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని దేవనూరు,జలకనూరు గ్రామాలలో మల్లికార్జున రిజర్వాయర్ వస్తుందని 25.2.2023 న పత్రికల్లో వచ్చినది. శాశ్వత త్రాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కొరకు 1.99 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈవిషయం పత్రికల్లో రావడం పట్ల గ్రామాలు మునిగిపోతాయేమోనని గ్రామాల్లో పుకార్లు వినపడుతున్నాయి.అంతేకాదు లక్షల కొద్ది వెచ్చించి ఇల్లు కట్టుకున్నామంటూ ఆయా గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అందుకుగాను వైసీపీ సమాచార సాంకేతిక విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్ జగన్ మోహన్ రెడ్డి, నందికొట్కూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్న మల్లారెడ్డి మరియు తువ్వా లోకేశ్వర రెడ్డి కలసి గ్రామాల్లో వినిపిస్తున్నటువంటి రిజర్వాయర్ నిజమా కాదా ఆయా గ్రామాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఈ ప్రాజెక్టు నిర్మాణం పట్ల పూర్తి వివరాలు ఆయా గ్రామాల ప్రజలకు తెలియజేస్తే వారిలో ఉన్నటువంటి అపోహలు వీడుతాయని వినతి పత్రం ద్వారా తెలియజేస్తూ తహసిల్దార్ తో వారు మాట్లాడారు.వీటి పట్ల తహసిల్దార్ మాట్లాడుతూ సమగ్ర విచారణ జరిపి అంతేకాకుండా పై అధికారులతో ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకొని వివరంగా ప్రజలకు తెలియజేస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు.