డిస్టిక్ లెవెల్ అధికారులతో సమీక్ష సమావేశం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాదికార సంస్థ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి అధ్యక్షతన- అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ మరియు హిట్ అండ్ రన్ కేసులపై శుక్రవారం డిస్టిక్ లెవెల్ అధికారులైన ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, సూపరింటెండెంట్ అఫ్ పోలీస్లు,జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ జైలు సూపరింటెండెంట్, డిస్టిక్ జైల్ల అధికారి మొదలగు అధికారులతో హైబ్రిడ్ మోడ్లో మానిటరింగ్ మీటింగ్ నిర్వహించడం జరిగినది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ లో జైల్ల లో విచారణ కోసం ఎదురుచూస్తున్న ఖైదీల కేసులను సమీక్షించారు. ఎక్కువకాలం జైల్లో ఉన్న చిన్న నేరాలు చేసిన లేదా పేదరికంతో బెయిల్ పొందలేని నిందితులను విడుదల చేయడానికి మరియు మహిళలు, ఆరోగ్యంతో ఉన్న నిందితుల కేసులపై సమీక్ష నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు మరియు ఎస్పీలు, డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్స్, డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, డిటి ఆర్ బి అధికారులు, డి ఎం అండ్ హెచ్ ఓ అధికారులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివ రామ చంద్ర రావు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొనడం జరిగింది.


