ముగిసిన ఎంపీటీసీ’ల చివరి సమావేశం…
1 min read
23 తో ముగియనున్న ఎంపిటిసి’ల పదవీకాలం..
మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: గత ఐదేళ్లపాటు పదవిలో ఉన్న ఎంపీటీసీల పదవీకాలంలో ప్రతి మూడు నెలలకోసారి మండల సర్వసభ్య సమావేశానికి హాజరై గ్రామాల్లో నెలకొన్న సమస్యల గురించి సభ దృష్టికి తీసుకువచ్చే వారు. కానీ ఎంపీటీసీల పదవి కాలం ఈనెల 23వ తేదీతో ముగియనుంది.నిన్న జరిగిన సమావేశం వీరికి చివరి సమావేశమైంది.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది.ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా వివిధ శాఖల మండల అధికారులు తమ నివేదికలను చదివారు. గ్రామాల అభివృద్ధికి మండల అధికారులు కృషి చేయాలని ఎంపీపీ వెంకటేశ్వరమ్మ సూచించారు.ఎల్ నినో ప్రభావంతో గ్రామాల్లో నీటి సమస్య రాకుండా చూడాలని ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,ఏవో పీరు నాయక్,స్వర్ణ గ్రామ మండల అధికారి సురేష్ కుమార్,ఏఈ ప్రతాప్ రెడ్డి, క్రాంతికుమార్,ఏపీవో నాగమ్మ,ఎంపీటీసీలు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


