పదవ తరగతి సీబీఎస్సీ ఫలితాలలో రిడ్జ్ స్కూల్ ప్రతిభ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నేడు ప్రకటించిన సి బి యస్ ఇ పదవ తరగతి ఫలితాలలో రిడ్జ్ స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను సాధించారని పాఠశాల సిఇఓ జి.గోపినాథ్ తెలియజేశారు. మొత్తం 111 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 90% పైన 30 మంది విద్యార్థులు, 80% పైన 63 మంది విద్యార్థులు, 70% పైన 84 మంది విద్యార్థులు, 60% పైన 102 మంది విద్యార్థులు ప్రతిభ సాధించారు. టి. కేదార్ రెడ్డి 486 , ఎస్. నందిని రెడ్డి 479 , టీవీ. తేజోదయ్ 478, వి. దాక్ష 475, ఎస్. గౌతం 474 , పెరుగు లక్ష్మీ గాయత్రి 473, మార్కులతో ప్రతిభను చాటారు .ఈ అద్భుత ప్రతిభను సాధించిన విద్యార్థులను, అందుకు కృషి చేసిన అధ్యాపకులను, విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల సీఈవో జి. గోపీనాథ్ , కో సిఇఓ శ్రీమతి సౌమ్యాగోపినాథ్ ,డీన్ రాజేంద్రన్ ,ప్రిన్సిపాల్ ఎ.రాజ్ కమల్, కోఆర్డినేటర్ హరికృష్ణ లు అభినందించారు .