PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఆర్ఆర్ మేకింగ్‌ అదుర్స్‌

1 min read

సినిమా డెస్క్​ : భారీ యాక్షన్‌ చిత్రాలను నిర్మించడంలో దిట్ట రాజమౌళి. ‘బాహుబలి’ తర్వాత వస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ అప్ డేట్స్ కోసం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో నిన్న ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ పేరుతో మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో రాజమౌళితో పాటు సినిమాకి వర్క్ చేస్తున్న టెక్నికల్ టీమ్ అంతా ఉన్నారు. రాజమౌళి సీన్స్ వివరించడం, గ్రాఫిక్స్ పరిశీలించడం, భారీ సెట్స్ నిర్మాణం, యాక్షన్ సీన్స్ తీయడం వరకూ ఇంటరెస్టింగ్ విజువల్స్‌తో ఈ వీడియో ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఉంది. హీరోలు తారక్, చరణ్‌తో పాటు అజయ్ దేవగణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, శ్రియ, సముద్రఖని, రే స్టీవెన్ సన్, అలీసన్ డూడీ షూటింగ్‌లో పాల్గొంటున్న విజువల్స్ ఆకట్టుకున్నాయి. ముందుగా అనౌన్స్ చేసినట్టుగానే ఈ ఏడాది అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని థియేటటర్లలో విడుదల చేస్తారని వీడియో ద్వారా మరోసారి కన్ ఫర్మ్ చేశారు.

About Author