NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడి అంశం పై సీఈసీతో ఆర్ఆర్ఆర్ భేటీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీఈసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌కుమార్‌తో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్‌ను ప్రకటించడంపై ఫిర్యాదు చేశారు. పీపుల్ యాక్ట్ 1951 ఉల్లంఘించారని రఘురామ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. భేటీ అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడుతూ శాశ్వత అధ్యక్షుడు పదవి అనేదే అశాశ్వతమన్నారు. రాజ్యాంగం ప్రకారం శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక చెల్లదని తెలిపారు. మనసులో ఏదో భయాలు పెట్టుకొనే.. శాశ్వత అధ్యక్షుడు కావాలని జగన్‌ అనుకున్నారని విమర్శించారు. ఇప్పటివరకు ఇలాంటి కేసు సీఈసీ ముందుకు రాలేదని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి, సీఈసీకి ఇది పూర్తిగా విరుద్ధమని ప్రకటించారు.

                                           

About Author