ఆర్ఆర్ఆర్ సినిమా నిషేధించండి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆర్ఆర్ఆర్ సినిమా పై కర్ణాటకలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. కర్ణాటకలో అంత పెద్ద ప్రీరిలీజ్ ఈవెంట్ జరిపారు కానీ కన్నడ భాషలోకి సినిమాను అందుబాటులోకి తీసుకురావడం మరిచేపోయారు. అందులోనూ ఆర్‌ఆర్‌ఆర్ తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉండంతో మరి కన్నడ వర్షన్ మాటేమిటి? అంటూ మండిపడుతున్నారు ఆ ప్రాంతీయవాసులు. ఒకరకంగా ఇది కన్నడ భాషను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ భాషలో అందుబాటులోకి తెస్తే తప్ప ఈ సినిమాను చూసేదే లేదంటూ శపథం పూనుతున్నారు. ఈ నేపథ్యంలో బాయ్‌కాట్ ఆర్‌ఆర్‌ఆర్ ఇన్ కర్ణాటక(#BoycottRRRinKarnataka) హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.