పరీక్షలు బాగా రాయాలని పదో తరగతి విద్యార్థినీల సరస్వతీ పూజ
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు : పదో తరగతి పరీక్షలు బాగా రాయాలని కాంక్షిస్తూ, పత్తికొండ స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ పర్యవేక్షణలో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బుధవారం సరస్వతి పూజ ఘనంగా జరుపుకున్నారు. అదేవిధంగా 9వ తరగతి విద్యార్థినీలు పదవ తరగతి వారికి వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు నిర్భయంగా పండుగ వాతావరణం లో రాయాలని సూచించారు. పట్టుదలతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా భవిష్యత్తులో మంచి ఉన్నత చదువులు చదివి, ప్రయోజకులై, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యా తులు తీసుకుని రావాలని కోరారు. .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.
