“జగనన్నకు చెబుదాం – స్పందన” కార్యక్రమం రద్దు
1 min read– జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఈనెల 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీ నిర్వహించాల్సిన”జగనన్నకు చెబుదాం – స్పందన” కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సోమవారం (14-08-23) నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో నిర్వహించే “జగనన్నకు చెబుదాం – స్పందన” కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వ్యయ ప్రయాసల కోర్చి ఎవరు జిల్లా కేంద్రానికి రావద్దని ఆయన ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అయితే మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో జరిగే “జగనన్నకు చెబుదాం – స్పందన” కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.