NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

3 సం.ల లోపు స్క్రీనింగ్ తప్పనిసరి

1 min read

అవగాహన కల్పించిన డాక్టర్ అనిల్,సిడీపీఓ మంగవల్లి..

నందికొట్కూరు న్యూస్ నేడు: పుట్టిన పిల్లవాడి నుండి మూడు సం.ల లోపు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికీ  ఈసిడి స్క్రీనింగ్ చేయించాలని నందికొట్కూరు సిడిపిఓ మంగవల్లి అన్నారు. నంద్యాల జిల్లా పగిడ్యాల జిల్లా పరిషత్ పాఠశాలలోశుక్రవారం మధ్యాహ్నం మండల స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలకు ఐసిడిఎస్ సూపర్వైజర్ శేషమ్మ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ (ఈసీడీ) స్క్రీనింగ్ గురించి వివరించారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలతో ప్రేమ,ఆటలు,మాట్లాడటం వంటివి చేయాలి.పిల్లల్లో చిన్న వయస్సులోనే ఈ స్క్రీనింగ్ ద్వారా లోపాలు గుర్తించినట్లయితే త్వరగా నివారించవచ్చు.పుట్టుకతో వచ్చే లోపాలు అంగవైకల్యం వంటి లోపాలను మరియు సరియైన సమయంలో వచ్చే లోపాలన్ని గుర్తించి సరియైన సమయంలో జాగ్రత్తలు తీసుకొని మన పిల్లలను మనం కాపాడుకోగలము. పిల్లలే మన సంపద.కాబట్టి పిల్లలకు స్క్రీనింగ్ చేసేటప్పుడు తల్లి మరియు కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఉండాలి. చిన్నపిల్లల్లో శారీరక లోపాలను వెంటనే గుర్తించినట్లయితే లోపాలను నివారించవచ్చని డాక్టర్ అనిల్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం చంద్రకళ మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author