51వ జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు కర్నూలు జిల్లా క్రీడాకారుల ఎంపిక
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : స్థానిక కర్నూలు డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలోని బాస్కెట్బాల్ కోర్టు ప్రాంగణంలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన కర్నూలు జిల్లా క్రీడాకారులను ఘనంగా సన్మానించారు.కర్నూలు జిల్లా బాస్కెట్బాల్ సంఘం కార్యదర్శి దాదాభాష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయస్థాయికి ఎంపికైన క్రీడాకారులు:
1. దీపిక రెడ్డి 2. మోక్షిత్ 3. జ్యోతి స్వరూప్ 4. ఆనంద రావు , ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌతమ్ రెడ్డి పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాటి జాతీయస్థాయికి ఎంపికైన క్రీడాకారులకు నా వంతుగా ఆర్థిక సహాయం అందిస్తాను. కష్టపడితే తప్పకుండా ఫలితం సాధిస్తారు” అని అన్నారు.జిల్లా సంఘం కార్యదర్శి దాదాభాష మాట్లాడుతూ, “జాతీయస్థాయి శిక్షణ శిబిరం ఆగస్టు 9 నుండి 16 వరకు అమలాపురంలో జరుగుతుంది. అలాగే జాతీయస్థాయి పోటీలు విజయవాడలో నిర్వహిస్తారు” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ముస్తహీర్ తదితరులు పాల్గొన్నారు.


