NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లయన్స్ అంతర్జాతీయ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టాలి

1 min read

లయన్స్ జిల్లా గవర్నర్ అడ్వైసర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.

కర్నూలు , న్యూస్​ నేడు:   లయన్స్ క్లబ్స్  ఇంటర్నేషనల్ 200 దేశాలలో సేవా కార్యక్రమాలు అందిస్తున్న ప్రపంచంలోనే ఉత్తమ సేవా సంస్థ అని లయన్స్ జిల్లా గవర్నర్ అడ్వైసర్ లయన్ డాక్టర్  రాయపాటి శ్రీనివాస్ అన్నారు.నేడు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్  మెల్విన్ జోన్స్ 2026 -27 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన లయన్స్ మెంబెర్లకు  లయన్స్ ఇంటర్నేషనల్ మెంబెర్ షిప్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో  లయన్స్  క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ అధ్యక్షులు  లయన్ టి. గోపినాథ్,రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ లయన్ గుర్రం త్రినాథ్ కుమార్,ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు లయన్ మురారి శంకరప్ప,ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లయన్ నాగస్వామి నాయక్, రిటైర్డ్ విశ్వ భారతి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ లయన్ డాక్టర్ ప్రభాకర్,రిటైర్డ్ తాసిల్దార్ లయన్ తిరుపతి సాయి, ఉపాధ్యాయులు లయన్ దామోదర్, మంజునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author