ఆర్ యు లో “నశా ముక్త్ భారత్ అభియాన్” ప్రతిజ్ఞ, ర్యాలీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాయలసీమ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో “నశా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాయలసీమ విశ్వవిద్యాలయం గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ వి. వెంకట బసవ రావు అధ్యక్షత వహించి, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మత్తు వ్యసనాల నిర్మూలనలో ప్రతి విద్యార్థి తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ బి విజయ కుమార్ నాయుడు, రెక్టర్ ప్రొఫెసర్ యన్. టీ. కె. నాయక్ , ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్. పి. సుందర ఆనంద్ , ప్రొఫెసర్ కృష్ణా రెడ్డి మరియు ప్రొఫెసర్ భరత్ కుమార్ పాల్గొనారు.జాతీయ సేవా పథకం కార్యక్రమ సమన్వయకర్త డా. బి. కవిత మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “నశా ముక్త్ భారత్ అభియాన్” విజయవంతం కావాలంటే యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని తెలిపారు. సమాజంలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, శ్రీ బి వి శివ ప్రసాద్ రెడ్డి, డా. స్ .నాగ చంద్రుడు, డా. కె. వెంకట రత్నం, ఎన్‌ఎస్‌ఎస్ స్వచ్ఛంద సేవకులు పాల్గొని మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, ఇతరులను కూడా చైతన్యపరుస్తామని ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమం విజయవంతంగా ముగియగా, విద్యార్థులు మత్తు రహిత భారత నిర్మాణానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని సంకల్పించారు.


