నేటి పాలకులు ఛత్రపతి సాహు మహారాజ్ ను ఆదర్శంగా తీసుకోవాలి
1 min read
భారతదేశ ఆదర్శ పాలకులు బహుజన రాజులే…
ఛత్రపతి సాహుమహారాజ్ 152జయంతి సందర్బంగా ఘననివాళి..
కర్నూలు, న్యూస్ నేడు: భారత దేశ చరిత్ర గతిని మార్చిన రాజులలో అగ్రఘన్యుడు ఛత్రపతి సాహుమహారాజ్. వేలసంవత్సరాలుగా సమాజాన్ని మనువాదుల దోపిడినుండి పీడన నుండి బహుజనులకు విముక్తి కలిగించిన మహోన్నత వ్యక్తి సాహు మహారాజ్ అని BAMCEF, బహుజన్ ముక్తి పార్టీ, భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో BAMCEF కర్నూలు జిల్లా కార్యాలయంలో జరిగిన సాహు మహారాజ్ 152 వ జయంతి సందర్బంగా డా. వి. వి. సుబ్రహ్మణ్యం అన్నారు. బ్రాహ్మణుల అణచివేత నుండి బహుజన సమాజాన్ని మేల్కొలిపి బహుజనులకు విద్యను చేరువచేయటమే కాక తన కొల్హాపూర్ సంస్థానంలో దేశంలోనే మొదటిసారిగా దళితులకు మరియు శూద్రులకు 50% రిజర్వేషన్ కల్పించి సామాజిక న్యాయం కల్పించి రిజర్వేషన్ ల పితామహుడుగా ప్రసిద్ది చెందారని బిసి సంక్షేమ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు అన్నారు.బాబా సాహెబ్ అంబేడ్కర్ కు అన్నివిధాలుగా సహకరిస్తు ఈ దేశప్రజలకు దాస్య విముక్తుడు బాబాసాహెబ్ అని చాటాడు. ఇప్పటికైనా ఈ దేశంలోని బహుజనుల మనువాదుల విషపు కౌగిల్ల నుండి బయట పడాలని ఆత్మగౌరవం తో జీవించాలని ఆశించాడు. దురదృష్టవశత్తు ఈ దేశపు బహుజనులైన ఎస్సీ, ఎస్టీ ఓబీసీ, మైనారిటీ ముస్లిం క్రిస్టియన్లు మనువాదులను అధిపత్య కులాలను నమ్మి మోసపోతున్నారే తప్ప. మేము మోసపోతున్నమన్నా స్పృహ కూడా వారిలో లేకపోవటమే ఆశ్చరకరం. 75 సంవత్సరాలుగా ఓబీసీ ల కుల గణన జరపాకపోయినా జనాభా ప్రాతిపదికన 50% ఓబీసీ రిజర్వేషన్ కల్పించకపోయినా గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్లుగా మోసం చేస్తున్న పార్టీల వెంట తిరుగుతున్నారే తప్ప 15% ఉన్న అధి పత్యకులాల కాళ్ల కిందపడి బానిస బ్రతుకులు బ్రతుకుతున్నమన్నా స్పృహలేకపోవటమే ఆశ్చర్యం.. ఇప్పటికైనా బహుజనులు మేల్కొనాలని సాహు మహారాజ్ కి నివాళి అర్పించిన పిమ్మట వక్తలు డా.కంచర్ల హరి ప్రసాద్, దాసరి రామశేషయ్య అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రభుదాస్, నాగరాజు, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.


