యస్ జి టి కనక మహాలక్ష్మీ ప్రతిభ
1 min read
విజయవాడ, న్యూస్ నేడు: విజయవాడ సెంట్రల్ పరిధిలోని జి యస్ ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షా ఫలితాలలో యస్ జి టి గా పనిచేస్తున్న నామాల కనక మహాలక్ష్మీ పదవ తరగతి బోధించే బి ఇ డి అసిస్టెంట్, ఫిజిక్స్ అందుబాటులో లేని తరుణంలో, తప్పనిసరి పరిస్థితుల్లో ఫిజికల్ సైన్స్ బోధించవలసివచ్చింది. అయినప్పటికీ మహాలక్ష్మి దానిని ఛాలెంజ్ గా స్వీకరించి తమ శాయశక్తులా కృషి చేసి విద్యార్థులకు ఉదయం మరియు సాయంత్రం ఫిజిక్స్ అదనపు తరగతులు నిర్వహించడం ద్వారా , బయాలజీ ఉపాధ్యాయిని శ్రీమతి రఘుపతమ్మ తో కలిసి సమన్వయంతో కృషి చేసి సైన్స్ లో వంద శాతం రిజల్ట్ తేవడం ద్వారా పాఠశాలకు మంచి ఫలితాలు రాబట్టడంలో కృషి చేశారు. పరీక్ష రాసిన నలుబది మూడు మంది విద్యార్థులలో సైన్స్ లో 16 మంది 90 మార్కులు పైగా సాధించడం, నలుగురికి 99 మార్కులు రావడం గమనార్హం గతంలో కూడా శ్రీమతి కనక మహాలక్ష్మి సుమారు 16 సంవత్సరాల క్రితం కొత్తపేట, ఎ డి యమ్ సి ఉన్నత పాఠశాలలో కూడా యస్ జి టి గా తప్పనిసరి పరిస్థితుల్లో పదవతరగతి మాధమాటిక్స్ సబ్జెక్టు బోధించి ప్రధమ ప్రయత్నంలోనే వంద శాతం రిజల్ట్ తెచ్చి కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు పొందడం కూడా జరిగింది. ఈమె శ్రమను, సాధించిన విజయాన్ని గుర్తించి పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి జి పుష్పలత , తోటి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా అభినందనలు తెలియజేశారు.