శంకర భగవత్పాదుల జయంతి వేడుకలు ప్రారంభం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: వైశాఖ శుద్ధ పంచమి జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆళ్ళగడ్డ పట్టణం, మల్లిఖార్జున శాస్త్రి వీధిలోని శ్రీ ఆదిశంకరాచార్య మందిరం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజుల ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ మూడు రోజులపాటు ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజనలు, మే 2వ తేది శుక్రవారం శ్రీ ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలతో పాటు ప్రముఖ సంస్కృత పండితులు డాక్టర్ దివి హయగ్రీవాచార్యులచే శంకర వైభవంపై ధార్మిక ప్రవచనం తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమాలు ప్రారంభం సందర్భంగా మొదటిరోజు భక్తితత్త్వంపై విశ్రాంత జిల్లా న్యాయమూర్తి కాశీభట్ల శివప్రసాద్ ప్రవచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు టి.వి.వీరాంజనేయరావు, జాతీయ సాహిత్య పరిషత్ జిల్లా సమన్వయకర్త సి.రామకృష్ణ, శ్రీ ఆదిశంకరాచార్య మందిర నిర్వాహకులు కాశీభట్ల వెంకట విజయలక్ష్మి, అడ్వకేట్ సాయి స్వరూప్, సత్య ప్రసాదు, శ్రీకాంత్ రెడ్డి, శ్రీ ఆదిశంకర సేవా సత్సంగ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.