NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజయవాడ వేదికగా షిరా డైమండ్స్…

1 min read

ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్..

ఓపెనింగ్‌ ఆఫర్‌గా బంగారు ఆభరణాలపై 50% ఫ్లాట్ తగ్గింపు..

డైమండ్ క్యారెట్ ధరలపై 25% తగ్గింపు

విజయవాడ, న్యూస్​ నేడు: విజయవాడ స్థానికులకే కాకుండా ఇతర ప్రాంతాల వారికి సైతం మహానగరంగా మార్చే ప్రక్రియలో నగరంలో ఆధునిక జీవన శైలిని పెంపొందించడం ఎంతో అవసరమని.. ఈ నేపథ్యంలో విజయవాడ వేదికగా షిరా డైమండ్స్ ప్రారంభించడం అభినందనీయమని, ఆహ్వానించతగిన సందర్భమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు, ఆహార & వినియోగదారుల వ్యవహారాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని సాయి నగర్‌ శ్రీ గాయత్రి కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో సోమవారం గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన షిరా డైమండ్స్‌ను మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ సోమవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సం‍దర్భంగా మంత్రి మాట్లాడుతూ., షిరా డైమండ్స్ వంటి ఈ తరం మెచ్చే అధునాతన వేదికలు మన యువ తరాలకు అనుగుణంగా డిజైన్లను రూపొందించడంలో వారి వినూత్న విధానాన్ని తాను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. కష్టమర్లు నచ్చే డిజైనింగ్స్‌తో షిరా డైమండ్స్‌కు మరింత మంచి ఆదరణ లభించాలని మంత్రి ఆశించారు. షిరా డైమండ్స్‌ను విజయవాడలో ఏర్పాటు చేసిన వ్యవస్థాపకులు శ్రీజ తిప్పల, లీలా యెమెనేని ఆధునిక దృష్టి, కృషి అభినందనీయమని ప్రశంసించారు.సహావ్యవస్థాపకురాలు శ్రీజ తిప్పల మాట్లాడుతూ., షిరా డైమండ్స్‌ 18 సంవత్సరాల అనుభవం కలిగిన లెగసీ బ్రాండ్‌. విజయవాడలో ప్రారంభించబడిన మూడవ స్టోర్ ఇది. ఈ స్టోర్‌ నగరవాసుల ఆభరణాల అవసరాన్ని పూర్తిగా తీర్చగలదని అన్నారు. షిరా డైమండ్స్‌లో పోల్కి, కుందన్, డైమండ్, బంగారం ఆభరణాలతో సహా అన్ని వర్గాలకు చెందిన విభిన్న శ్రేణిని డిజైన్‌లను అందిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా పెళ్లి ఆభరణాలలో ప్రత్యేకత కలిగి ఉన్నామని, సరసమైన బడ్జెట్‌లలో ఇవి లభిస్తాయని అన్నారు. గ్రాండ్ ఓపెనింగ్‌ ఈఫర్లలో భాగంగా షిరా డైమండ్స్ బంగారు ఆభరణాలపై 50% ఫ్లాట్ తగ్గింపు, డైమండ్ క్యారెట్ ధరలపై 25% తగ్గింపు, పోల్కీ ఆభరణాలపై తయారీ ఛార్జీలు లేదా వృధా రుసుములు ఉండవని అన్నారు. “ఇది విజయవాడ ప్రజలకు న్యూ ట్రీట్” అని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

About Author