NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్జీల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

1 min read

అర్జీలు పరిష్కార తీరు పారదర్శకంగా నాణ్యతతో ఉండాలి

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : అర్జీల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు, ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి సూచించారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు. జిల్లా  కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ పి.ధాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, జడ్పీ సీఈవో యం.శ్రీహరి, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయ రాజు,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యం.ముక్కంటి,ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరీష్, ఎస్‌డీసి కె.భాస్కర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ పీజేఆర్ ఎస్ లో ప్రజల నుంచి అందిన అర్జీల పరిష్కార సరళిపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు.పి జి ఆర్ ఎస్  కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు క్షేత్ర స్థాయిలోనే పరిష్కార మార్గాలు చూపించి అర్జీలు రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు.

అందిన అర్జీలలో కొన్ని

పోలవరం మండలం క్రొత్త పట్టిసీమకు చెందిన మండవల్లి సత్యవతి  పసుపు కుంకుమ క్రింద నాకు స్థలం ఇచ్చియున్నారని ఆ స్థలం ఆక్రమణకు గురైందని, విచారణచేసి తిరిగి తనకు ఇప్పించాలని అర్జీ అందజేశారు. ఉంగుటూరు మండలం గోపినాథ్ పట్నంకు చెందిన గంటా పెద ఆంజనేయులు నా భార్యకు ప్రభుత్వం వారు డి నమూనా పట్టా కింద 63 సెంట్లు భూమి ఇచ్చారని,సదరు భూమి వేరే వారు రిజిస్ట్రేషను చేయించుకున్నారని, దీనిపై విచారణచేసి నా పేరున రిజిస్ట్రేషను చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు, ద్వారకాతిరుమల మండలం పి.కన్నాపురంకు చెందిన బత్తిన శ్రీనివాస రావు బస్ స్టాండు దగ్గర పంచాయతీ కుళాయికి పైపులు తగిలించుట వలన త్రాగునీరుకు తీవ్ర ఇబ్బందులు పడుచున్నామని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లింగపాలెం మండలం చంద్రన్నపాలెం చెందిన  శ్రీకాకొల్లు శ్రీలక్ష్మి నా భర్త ధర్మాజిగూడెం బాలురు వసతి గృహంలో ఔట్సోర్సింగు ఉద్యోగిగా పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించినారని, నాకు ఔట్సోర్సింగు ఉద్యోగం ఇప్పించాలని కోరారు. పెదవేగి మండలం పెదవేగి గ్రామానికి చెందిన బొల్లికొండ శ్రీనివాస రావు మా గ్రామంలో పిహెచ్ సి స్థలం ఆక్రమణకు గురైందని,వారిపై చర్యలు తీసుకుని తిరిగి ఆ స్థలాన్ని పిహెచ్ సి కి అప్పజెప్పాలని కోరుతూ అర్జీ అందజేశారు.ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేటు సిబ్బంది పాల్గొన్నారు.

About Author