NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హైదరాబాద్‌లో షూటింగ్‌

1 min read

సినిమా డెస్క్​: రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న మూవీ షూటింగ్ స్టార్ట్‌ అయ్యింది. హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌‌’తో మాస్‌ ఆడియెన్స్‌కు ఎంతో దగ్గరైన రామ్‌ ఇప్పుడు కూడా ఓ మాస్ ఎంటర్‌ ‌టైనర్‌‌కే కమిటయ్యాడు. ఇస్మార్ట్ స్టైల్‌లోనే దీనికి ‘ఉస్తాద్‌’ అన్న టైటిల్‌ను ఫిక్స్‌ చేసారని సమాచారం. తెలుగు, తమిళ బైలింగ్వల్‌ మూవీ అయిన దీన్ని తమిళ డైరెక్టర్‌‌ లింగుస్వామి తెరకెక్కిస్తున్నాడు. ‘ఉప్పెన’ ఫేమ్‌ కృతి శెట్టి హీరోయిన్. ఇది రామ్‌ 19వ సినిమా. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. లింగుస్వామి తీసిన రన్, పందెంకోడి, ఆవారా లాంటి తమిళ డబ్బింగ్‌ సినిమాలు తెలుగు ప్రేక్షకులనూ ఎంతగానో మెప్పించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీ ఇంకెంత మెప్పించనుందో.

About Author