వెంకట కొండ పురం గ్రామ సమస్యను పరిష్కరించండి: కొండా హెల్పింగ్ హాండ్స్
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని వెంకట కొండాపురం గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పర్యటించారు. వెంకట కొండాపురం గ్రామంలో స్మశాన వాటిక కోసం మరియు కమ్యూనిటీ హాల్ కోసం డోన్ శాసన సభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి కి కొండ హెల్పింగ్ హాండ్స్ ఫౌండర్ కొండ లోకేష్ రావు మరియు సొసైటీ ట్రెజరర్ కొండ ప్రతాప్ కుమార్ కలిసి ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఇదే సమస్యను ఇంతకుముందు మార్చి 2025 సంవత్సరంలో పింఛన్ పంపిణీ కార్యక్రమానికి వచ్చినప్పుడు తెలియజేశాము ఇంత వరకు ఈ సమస్యను పరిష్కరించలేదని సొసైటీ సభ్యులు ప్రతాప్ కుమార్ మరొకసారి గుర్తు చేశారు. అదేవిధంగా ఊర్లో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యను కూడా వెంటనే పరిష్కరిస్తారని కొండ హెల్పింగ్ హాండ్స్ సొసైటీ ద్వారా విన్నపించుకున్నారు.

