పట్టణంలో పారిశుధ్య నిర్వహణ,ఇంటింటి చెత్త సేకరణ పై ప్రత్యేక దృష్టి
1 min read– రాయచోటి మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: చెత్తను రోడ్లపై,మురుగు కాలువల్లో పారావేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించి,పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని,అదేవిధంగాపట్టణ పరిశుభ్రత లో ప్రతీ పౌరుడు భాగస్వామి కావాలని మున్సిపల్ కమీషనర్ గంగాప్రసాద్ పిలుపునిచ్చారు.గురువారం మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పారిశుధ్య పనులు,ఇంటింటి చెత్త సేకరణ పనులను కమీషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్త సేకరణ ఆటోలు ప్రతీ రోజు ప్రతీ ఇంటి నుండి చెత్త సేకరణ చేయాలని కార్యదర్శులకు పారిశుధ్య కార్మికులకు సూచించారు.ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా తప్పనిసరిగా మీ ఇంటి వద్దకే వచ్చి,చెత్తను సేకరిస్తున్న వాహనాలకు అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జున, శానిటరీ ఇన్స్పెక్టర్ కొండయ్య,శానిటరీ కార్యదర్శులు పారిశుద్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.