ఆగష్టు, 21,22,23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్
1 min read
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీదేవి
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సమాధాన్ సమారోహ్ కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టులో పెండింగు లో ఉన్న రాజీ కి అర్హమైన కేసులను ‘సమాధాన్ సమారోహ్’ కార్యక్రమం ద్వారా ఆగష్టు, 21,22,23 తేదీలలో జరిగే ప్రత్యేక లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్.శ్రీదేవి, మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి మాట్లాడుతూ రాజీకి అనుకూలమైన కేసులు పరస్పర అవగాహనతో పరిష్కరించు కోవాలని సూచించారు. న్యాయవాదులు, కక్షిదారులు సమాధాన్ సమారోహ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రత్యేక లోకాదాలత్ నందు కేసులు పరిష్కారం నిమిత్తం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సమన్వయకర్తగా వ్యవహరిస్తారని, అలాగే కేసులు పరిష్కారంలో సందేహాలు ఉన్న 15100 ద్వారా సంప్రదించాలని శ్రీదేవి సూచించారు.

