ఏపీ జిఇఏ ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మహిళలకు ఉద్యోగ బాధ్యతలతో పాటు ఆటవిడుపులు కూడా అవసరమే అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని బుధవారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటల పోటీలను ఆమె ప్రారంభించడం జరిగింది. ఈ ఆటల పోటీల్లో ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఉద్యోగులు మెడికల్ కాలేజీ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది.. వీరికి వివిధ అంశాల్లో పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ అనిల్ కుమార్ రెడ్డి, నర్సింగ్ సూపరిండెంట్ గ్రేడ్ వన్ సావిత్రిబాయి, ఏపీజీఏ జిల్లా అధ్యక్షులు బంగి శ్రీధర్, సెక్రటరీ సురేష్ రెడ్డి ట్రెజరర్ పవన్, సూపర్డెంట్ సునీత, ట్యూటర్ నారాయణమ్మ, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్, మురళీధర్ నాయుడు, చిన్ని కృష్ణ, హసన్, ఆంజనేయులు, నాయక్, జయమ్మ ,మెహబూబీ జానకి తదితరులు పాల్గొన్నారు.