స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ నెం. 21 ను ఆకస్మికంగా తనిఖీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి పరీక్షల నియంత్రణాధికారి . Simon Victor కర్నూలులోని స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ నెం. 21 ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంప్‌లో జరుగుతున్న అన్ని కార్యకలాపాలు, మూల్యాంకన ప్రక్రియను పరిశీలించారు.క్యాంప్‌లో ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షకులు అడిగిన సందేహాలను నివృత్తి చేసి, అవసరమైన సూచనలు అందించారు. ప్రస్తుతం స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగుతోందని తెలిపారు.అదనంగా, మూల్యాంకన ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆయన సూచించారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మూల్యాంకన పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. క్యాంప్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కృషిని అభినందించారు.

