శ్రీ శ్రీ కోల్లాపురమ్మ దేవి దేవర కార్యక్రమానికి హాజరైన చిప్పగిరి లక్ష్మీనారాయణ..
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/3-9.jpg?fit=550%2C725&ssl=1)
శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ కథ బైలాట నాటిక ప్రదర్శన కార్యక్రమానికి 10,000/- రూపాయలు నగదును గ్రామ పెద్దలకు అందించిన చిప్పగిరి లక్ష్మీనారాయణ.
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: హోలగుంద మండలం సులవాయి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ కోల్లాపురమ్మ దేవి దేవర కార్యక్రమానికి హాజరైన ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ .. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కోల్లాపురమ్మ దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవర సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న రేణుకా ఎల్లమ్మ కథ (బైలాట) నాటిక ప్రదర్శన కార్యక్రమానికి 10,000/- రూపాయలు నగదును అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గిరిమల్లప్ప, హనుమంతప్ప చిన్న ఈరన్న, ఉశేనప్ప, గాధిలింగప్ప, పెద్ద నాగప్ప వెంకటేష్ మరియు ఉచ్చిరప్ప మరియు కాంగ్రెస్ పార్టీ చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్ ఉపాధ్యక్షులు కరెంటు గోవిందు, ఓబీసీ సెల్ తాలుకా ఉపాధ్యక్షులు మీసాల గోవిందు ఎస్సీ సెల్ నాయకులు ఈరన్న మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు కత్తి రామాంజనేయులు, గూల్యం యల్లప్ప, ఎల్లార్థి మహేష్ గజ్జేహల్లి తాయన్న, ఖాజీపురం రాంబాబు, కోగిలతోట వీరేష్, రవి, మరియు విరుపాపురం బసవరాజు పాల్గొన్నారు.