శ్రీ విద్యాలయ కరస్పాండెంట్ మన్నె అశోక్ గజపతిరాజు జన్మదిన వేడుకలు
1 min read
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వివిధ కళాశాల యాజమాన్యం, వ్యాపారవేత్తలు,స్నేహితులు విద్యార్థినీ విద్యార్థులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : శ్రీ విద్యాలయ జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ మరియు సెక్రెటరీ మన్నె అశోక్ గజపతిరాజు జన్మదిన వేడుకలు సోమవారం నరసింహారావుపేట కాలేజీ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చరవాణిల ద్వారా, స్వయంగా వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు నగరంలోని ప్రముఖులు, వ్యాపారవేత్తలు,వివిధ కాలేజీల కరస్పాండెంట్స్, యాజమాన్యం,స్నేహితులు బంధుమిత్రులు,జర్నలిస్టులు, విద్యాలయ విద్యార్థిని విద్యార్థులు పూలదండలు అందించి,కేక్ కట్ చేసి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకొని పదిమందికి సహాయపడే సహాయకారిగా ఉంటారని పలువురు కొనియాడారు. అనంతరం ఒకరినొకరు కేక్ తినిపించుకుని ఆప్యాయతను పంచుకున్నారు.