NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వి గార్డ్ స్టెబిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సందర్శించిన సెయింట్ థరీసా విద్యార్థులు

1 min read

విద్యార్థులకు పరిశ్రమల పరిజ్ఞానంతో పాటు తరగతి గదులు అభ్యాసానికి, ప్రయోగశాలకు అనుసంధానంగా నిలిచింది

 ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : స్థానిక సెయింట్ థెరిసా మహిళా స్వయంప్రతిపత్తి కళాశాలకు చెందిన ఎలక్ట్రానిక్స్ విభాగం వారు ఫిజిక్స్ ద్వితీయ మరియు తృతీయ సంవత్సరం విద్యార్థులను కోసం విజయరాయిలో వి గార్డ్ స్టెబిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సందర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్టెబిలైజర్ అసెంబ్లీకి సంబంధించిన విభిన్న దశలు సర్క్యూట్ డిజైన్ క్వాలిటీ టెస్టింగ్ వంటి అంశాలను గమనించారు. పరిశ్రమలోని అధికారులు విద్యార్థులకు స్టెబిలైజర్ తయారీ ప్రక్రియలోని ఖచ్చితత్వం భద్రత మరియు నాణ్యత ప్రమాణాల ప్రాముఖ్యతను ప్రత్యేకంగా వివరించారు. ఈ సందర్శన విద్యార్థులకు పరిశ్రమల పరిజ్ఞానం అందించడంతో  పాటు తరగతి గది అభ్యాసానికి ప్రయోగాలకు మధ్య అనుసంధానంగా నిలిచింది.

About Author