పరిశుభ్రమైన మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుదాం
1 min read

డిప్యూటీ ఎంపీడీవో గంగనపల్లె సురేష్ బాబు
చెన్నూరు , న్యూస్ నేడు: చెన్నూరు గ్రామపంచాయతీని మోడల్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ లక్ష్య నిర్దేషణలో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు అన్నారు. మంగళవారం ఆయన మహిళా సంఘాలు, ఉపాధి హామీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, తో చెన్నూరు గ్రామపంచాయతీ పారిశుధ్యంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్టోబర్ 2 వ తేదీ నాటికి చెన్నూరు గ్రామ పంచాయతీ ని పరిశుభ్రమైన మోడల్ గ్రామ పంచాయతీ గా తీర్చిదిద్దేందుకు మనమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతిరోజు గ్రామ పంచాయతీలోని వార్డులను సందర్శించి ఇక్కడ ఉన్న మురికి కాలువలలో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా, అలాగే ఇంటి ముందర గుంతలు ఉండి వర్షపు నీరు నిలువడే చోట వర్షపు నీరు నిలవకుండా వాటిని పూడ్చివేసి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలా ఉండడం వల్ల వచ్చే అనార్థాలు, జబ్బుల గురించి వారికి తెలియజేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరు పారిశుద్ధ్యం, ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రత, పరిసరాలు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇలా లక్ష్యసాధనలో అన్ని మహిళల సంఘాలతో సచివాలయ సిబ్బంది ,ఉపాధి హామీ సిబ్బంది కలిసి గ్రూపులు గా ఏర్పాటు చేసి వార్డ్ ప్రకారం బాధ్యతలు తీసుకుని ఎక్కడ చెత్తను వేయకుండా మురికినిరు రోడ్ల పై వదలకుండా పరిశుభ్రమైన గ్రామ పంచాయతీ గా తయారు చేయాలని వారికి తెలియజేశారు.అదే విధంగా ప్రతి ఇంటి నుంచి తడి ,పొడి చెత్త వేరు చేసి క్లాప్ మిత్ర కు ఇవ్వాలని సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, కార్యదర్శి రామ సుబ్బారెడ్డి, ఉపాధి సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, మహిళ సంఘాలు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

