NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మండల కన్వీనర్ గా మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి..

1 min read

నందికొట్కూరు, న్యూస్​ నేడు: తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ల పదవుల పేర్లను ప్రభుత్వం ప్రకటించింది వీటిలో భాగంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గా మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డిని నియమించారు.ఇంతవరకు ఇక్కడ మండల కన్వీనర్ గా టి ఓబుల్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే.అదేవిధంగా జూపాడుబంగ్లా మండల పార్టీ కన్వీనర్ గా గుండ్రెడ్డి మోహన్ రెడ్డిని నియమించారు. ఇంతవరకు ఇక్కడ మండల కన్వీనర్ గా ఉన్న కడియం వెంకటేశ్వర్లు యాదవ్ కు ప్రభుత్వం రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇవ్వడంతో మండల కన్వీనర్ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది.మండల కన్వీనర్లుగా అవకాశం కల్పించినందుకు గాను మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,మోహన్ రెడ్డి మాండ్ర శివానందరెడ్డికి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

About Author