డిప్యూటీ ఇంజనీర్ ఇన్ చీఫ్ని కలిసిన ఎన్.జి.వోస్ రాష్ట్ర నాయకులు
1 min read
అధ్యక్ష,కార్యదర్శులు చోడగిరి శ్రీనివాస్,ఆర్.సి.హెచ్ కృష్ణారెడ్డి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : విజయవాడలో జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (అడ్మిన్) కార్యాలయంలో మంగళవారం డిప్యూటి ఇంజినీర్ ఇన్ చీఫ్ నెరుసు వీరప్రతాప్ తో ఉద్యోగులకు కావలసిన, అవసరమైన, నెరవేర్చవలసిన పలు అంశాలపై ఆయనకు తెలియజేశారు. అదేవిధంగా ఇరిగేషన్ ఎన్ జిఓ’స్ సమస్యలుపై కూడా ఆయనతో చర్చించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆర్ సిహెచ్ కృష్ణా రెడ్డి, సహాధ్యక్షుడు పి.రమేష్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పలువురు పాల్గొన్నారు.