చెడు అలవాట్ల కు దూరంగా ఉండండి…
1 min read
క్రీడాకారులకు సూచించిన. . సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
కర్నూలు, న్యూస్ నేడు : కుల మతాలకతీతంగా అందర్నీ ఏకం చేసే శక్తి కేవలం ఒక క్రీడా రంగానికి మాత్రమే ఉందని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు .కర్నూల్ నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఉషూ కరాటే పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉషు సంఘం కార్యదర్శి టి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ బి. శంకర్ శర్మ మాట్లాడుతూ తమ పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా, ఉత్తమ పౌరులుగా ఎదగాలంటే తల్లిదండ్రులు చిన్నతనం నుంచి వారిని క్రీడల్లో ప్రోత్సహించాలని ఆయన సూచించారు.క్రీడల్లో పాల్గొనడం వల్ల వారిలో యోగా, బ్రీతింగ్, వ్యాయామం, మెడిటేషన్, ఆత్మస్థైర్యం తదితర అంశాలు మిళితమై వారు ఆరోగ్యం మరింత మెరుగుపడేందుకు ఉపయోగపడతాయని చెప్పారు.