NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్ట్రోక్ మెకానికల్ థ్రాంబెక్టమీ 9 నిమిషాల్లో పూర్తి!

1 min read

60 ఏళ్ల వ్యక్తి మెద‌డులో మూసుకుపోయిన ప్రధాన ర‌క్తనాళం

మెకానిక‌ల్ థ్రాంబెక్టమీ పక్రియ చేసిన కిమ్స్ ఐకాన్ వైద్యులు

రికార్డు స‌మ‌యంలో అత్యంత వేగంగా ప్రక్రియ పూర్తి

విశాఖ‌ప‌ట్నం, న్యూస్​ నేడు : మెద‌డులో ర‌క్తనాళం మూసుకుపోయిన‌ప్పుడు వ‌చ్చే బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కేవ‌లం 9 నిమిషాల్లో ఒక రోగికి సాంత్వన క‌ల్పించి విశాఖ‌ప‌ట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వైద్యులు రికార్డు సృష్టించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్పత్రికి చెందిన న్యూరో, వాస్క్యుల‌ర్ ఇంట‌ర్వెన్షన‌ల్ రేడియాల‌జీ విభాగాధిప‌తి డాక్టర్ వెంక‌టేష్ పోతుల వివరించారు. ప్రపంచ‌వ్యాప్తంగా మ‌ర‌ణాలు, వైక‌ల్యాల‌కు స్ట్రోక్ ప్రధాన కార‌ణం. ఒక‌వైపు పక్షవాతం, ముఖం వేలాడిన‌ట్లు అయిపోవ‌డం, మాట స‌రిగా రాక‌పోవ‌డం, చూపు మంద‌గించ‌డం లాంటి ల‌క్షణాలుంటాయి. ఈ ల‌క్షణాల్లో ఏవి క‌నిపించినా ఒక్క నిమిషం కూడా ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. థ్రాంబెలైసెస్ లేదా మెకానిక‌ల్  థ్రాంబెక్టమీతో ప్రాణాలు కాపాడి, వైక‌ల్యాన్ని త‌గ్గించ‌వ‌చ్చు” అని డాక్టర్ వెంక‌టేష్ పోతుల తెలిపారు.

About Author