దేవనకొండ మండలం లో ఆప్టా విస్తృత సభ్యత్వం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నేడు దేవనకొండ మండలం ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ( ఆప్టా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు నాయకత్వం లో ఆప్టా సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా నిర్వహించబడింంది. మాచాపురం ఉన్నత పాఠశాల, దుప్పనగుర్తి, కోటకొండ, బేతపల్లి, బండ పల్లి మరియు చెల్లెలుచెలిమల గ్రామాల్లో పని చేసే ఉపాధ్యాయులు అందరూ ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ( ఆప్టా) సభ్యులు గా సభ్యత్వం ను తీసుకోవటం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు మాట్లాడుతూ రాష్ట్రం మొట్టమొదట గా ఉపాద్యాయ సమస్య ల పై ఉద్యమిస్తూ 1969 లోనే ప్రభుత్వ గుర్తింపు పొందిన మొట్ట మొదటి ఉపాధ్యాయ సంఘం ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా). అనివార్యం ఐన కారణం ల వలన వెనుక బడిన ప్రస్తుతం ఉపాధ్యాయ సమస్య ల పరిష్కారం లో ముందంజ లో ఉండి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది. కాబట్టి సభత్వ నమోదు కార్యక్రమం వేగవంతంగా జరుపబడుతుంది. వృత్తి పరమైన సమస్య ల పై ఉపాధ్యాయులు ఎప్పుడైనా మండల స్థాయి లేదా జిల్లా లేదా రాష్ట్ర స్థాయి నాయకుడు కె ప్రకాష్ రావు ను ఎప్పుడైనా 9849229829 సంప్రదించవచ్చని తెలియ చేశారు. దేవనకొండ మండలం యందు జరిగిన సభత్వ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు తో ఆప్టా మండల నాయకులు శ్రీమతి చంద్రకళ,చెన్నకేశవులు,మధుసూదన్ మరియు శ్రీనివాస్ పాల్గొన్నారు.

