NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మండల విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎస్టియు 2026 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: 2026 నూతన సంవత్సర సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ ప్యాపిలి మండల  మండల శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారుల చేతుల మీదుగా రాష్ట్రోపాధ్యా య సంఘం (ఎస్.టి. యు)యొక్క డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.79 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సంఘం మరియు ఉపాధ్యాయ సంక్షేమం కోసం విద్యారంగ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి రాష్ట్రపాధ్యాయ సంఘం  యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక ఎమ్మార్పీ సెంటర్ నందు జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్రపాధ్యాయ సంఘం ఎస్టి.యు స్టేట్ కౌన్సిలర్ వెంకట్ నాయక్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు  జి మదిలేటి మరియు బి. వై.మద్దిలేటి మాట్లాడుతూ ఉపాధ్యాయ వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఎస్.టి.యు సంఘం 2026 డైరీ ని రూపొందించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఎస్టియు డైరీ తీసుకోవాలని ఆ డైరీ ఉపాధ్యాయులకు చాలా చక్కగా ఉపయోగపడుతుందని తెలియచేయడం జరిగింది.ప్రతి సంవత్సరం రాష్ట్రపాధ్యాయ సంఘం  ఎస్. టి. యు డైరీ మరియు క్యాలెండర్ లను మండల విద్యాశాఖ అధికారుల చేతుల మీదుగా ఆవిష్కరించడం సాంప్రదాయంగా జరుగుతుందని ఈ సంవత్సరం కూడా ప్యాపిలి మండల విద్యాశాఖను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు మహేశ్వర్ రెడ్డి  మరియు వెంకటేష్ నాయక్ చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషించదగిన విషయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్. టి.యు స్టేట్ కౌన్సిలర్ వెంకట్ నాయక్, ఎస్.టి.యు మండల అధ్యక్షుడు జి .మద్దిలేటి, ప్రధాన కార్యదర్శి బి.వై. మద్దిలేటి,ఆర్థిక కార్యదర్శి ఏ. విజయ్ కుమార్ రెడ్డి సహాధ్యక్షులు వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి ,  గౌరవాధ్యక్షులు కిరణ్ కుమార్,  జిల్లా కౌన్సిలర్ నాగరాజు చంద్రమౌళి,  ఉపాధ్యక్షులు ఓబులేసు, సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యాయ వాణి కన్వీనర్ శివ, మండల సిపిఎస్ కన్వీనర్ మనోజ్  కుమార్ , సీనియర్ నాయకులు చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author