NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా కలెక్టర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు,నాయకులు

1 min read

జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా హాస్టల్ విద్యార్థులకు దుప్పల పంపిణీ చేసిన ఎస్ సి పి.సాల్మన్ రాజు

ఉద్యోగులు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని విద్యుత్తు ఉద్యోగుల వితరణ.కలెక్టర్ చేతుల మీదగా హాస్టల్ పిల్లలకు దుప్పట్ల పంపిణీ.నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈరోజు కలెక్టరేట్లో విద్యుత్ అధికారులు ఉద్యోగులు పాల్గొని కలెక్టర్  చేతుల మీదగా హాస్టల్ పిల్లలకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ పి.సాల్మన్ రాజు ని, అధికారులను ఉద్యోగులను కలెక్టర్ వెట్రి సెల్వి ఉద్యోగులు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే వినియోగదారుల సేవలలో మీరు ముందున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కెఎం. అంబేద్కర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి రాజకుమార్, ఏఈలు కే రాంబాబు పి.సంజయ్ మరియు నాయకులు తురగా రామకృష్ణ, భూక్య నాగేశ్వరరావు, వి. రాము తదితరులు పాల్గొన్నారు.

About Author