పౌర సరఫరాల గొడం పాయింట్ ను సబ్ కలెక్టర్ తనిఖీ
1 min read
ఆదోని, న్యూస్ నేడు: ఆదోని పౌర సరఫరాల గొదం పాయింటను సోమవారం ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారు తనిఖీ చేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్… గొదంలో ఉన్న రేషన్ నిల్వ, మరియు రికార్డ్స్, భద్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బియ్యం కార్డ్ లబ్ధిదారులకు పంపిణీ చేసే పక్రియలో ఏటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు సబ్ కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శివ రాముడు, ఉప తహశీల్దారు రవీంద్ర రెడ్డి, పౌరసరఫరాల ఉప తాసిల్దార్ వలి భాష, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.