ఆర్థిక సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కావు
1 min read
కష్టాలను ఎదురించి నిలబడే ధైర్యమే మనిషి జీవితం
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఆత్మహత్య నిర్ణయాలు క్షణికావేశం మాత్రమే
అటువంటి సమయంలో కుటుంబసభ్యుల కోసం కూడా ఆలోచించాలి
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదవేగి మండలం పెదకడిమిలో ఆత్మహత్యాయత్నం చేసిన దుర్గారావు కుటుంబాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రిలో హుటాహుటిన వెళ్లి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు.బాధితులకు తక్షణ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్యాధికారులకు ఆదేశాలిచ్చరు.ఆర్థిక సమస్యలు ఎంత పెద్దవైనా, జీవితంలో మానసిక ధైర్యంతో వాటిని ఎదురించి పోరాడాలే తప్ప ఆత్మహత్యలు ఏ సమస్యకూ పరిష్కారం కావని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ హితవు పలికారు. పెదకడిమి గ్రామానికి చెందిన దుర్గారావు (40) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల తాళలేక భార్యతో సహా కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఒక్కసారిగా ఊహించని ఘటన చూసిన ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా తల్లిదండ్రులు లేని జీవితం జీవించలేం అంటూ వారు కూడా అదే కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారనే విషాదకర వార్త తెలియగానే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.హుటాహుటిన ఏలూరు సర్వజన ఆసుపత్రికి చేరుకున్న ఆయన అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి మనోధైర్యం కల్పించారు.బాధితుడి చెయ్యి పట్టుకుని కొండంత ధైర్యం కల్పించి ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న బాధితుడు దుర్గారావు చెయ్యి పట్టుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే వారికి ఆత్మస్థైర్యాన్ని నింప్పి కష్టాలు అనేవి తాత్కాలికం. మన ప్రాణం అత్యంత విలువైనది. ఏ క్షణంలోనూ ఆత్మహత్య ఆలోచనలు మనస్సులోకి రానివ్వకూడదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నంత మాత్రాన జీవితాన్ని ముగించాలనే నిర్ణయం తీసుకోకూడదు. ఎటువంటి సమస్య ఉన్నా ఎదుర్కొని నిలబడాలి అని ఆ కుటుంబానికి కొండంత అభయాన్ని ఇచ్చారు.మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు ఆదేశిoచ్చారు. అనంతరం అక్కడే ఉన్న ఏలూరు సర్వజన ఆసుపత్రి సూపర్వైజింగ్ డాక్టర్లు, వైద్యాధికారులతో ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడారు. బాధితుల వైద్యంలో ఎటువంటి లోటూ రాకుండా,అత్యుత్తమమైన వైద్య సేవలు అందించి త్వరితగతిన కోలుకునేలా చూడాలని సూచించారు. ఆసుపత్రి ప్రాంగణంలో వైద్యులకు,సిబ్బందికి తగిన సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు.


