ఏలూరు జిల్లా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు
1 min read
విద్యార్థులకు యోగ,ఆటలు, పాటలు,డ్రాయింగ్,బొమ్మలు పై శిక్షణాలు
పర్యవేక్షించిన డిప్యూటీ లైబ్రేరియన్ ఏ నారాయణరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయం లో వేసవి విజ్ఞాన శిక్షణతరగతులు (సమ్మర్ ఓరియంటేషన్ కార్యక్రమము) రెండవరోజు మంగళవారం జరిగిన కార్యక్రమాలను డిప్యూటీ లైబ్రేరియన్ ఎ. నారాయణరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమములను సీనియర్ రిసోర్స్ పర్సన్ డి. శ్రీవల్లి విద్యార్ధుల చేత యోగాతో కూడిన సరదా ఆటల పోటిలు, కధలు చదివించుట, కధలు చెప్పించుట, పై శిక్షణలను నిర్వహిస్తున్నారు. డ్రాయింగ్ లో పి.శంకర్ మెళకువల పై శిక్షణ ఇచ్చారు. అనంతరం విద్యార్ధులకు కొంత విరామ సమయం కలిగించి స్నాక్స్ & చల్లటిపానియాలను ఏర్పాటు చెసారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లైబ్రేరియన్ విటి. సందీప్ కుమార్, జిల్లా కేంద్ర గ్రంధాలయం సిబ్బంధి, విద్యార్ధులు పాల్గొన్నారు.