యుద్ధ ప్రాతిపదికన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లీకేజీ పనులు
1 min read
ఇసుక బస్తాలు,గ్రావెల్ తో బెడ్ పనులు పూర్తి,అబ్జర్వేషన్ లో ఉండాలని అధికారులకు సూచన
ఎమ్మెల్యే ఆదేశాలతో కో-ఆప్షన్ సభ్యులు నూర్జహాన్ పెదబాబు పనులు పరిశీలన
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : యుద్ధ ప్రాతిపదికన గత 4 రోజులుగా జరుగుతున్న దెందులూరు సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వాటర్ లీకేజీ అరెస్ట్ పనులు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య,నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాలతో గురువారం కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు యర్రటిఎండలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తూ వాటర్ లీకేజీ అరెస్టు పనులను పరిశీలించారు. పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ మారయ్య ఇచ్చిన సూచనల ప్రకారం క్రాస్ బాండ్ పనులు జరుగుతున్నవి లేనిది మున్సిపల్ కమిషనర్ ఏ.భానుప్రతాప్ ఎం.ఈ సురేంద్రబాబు, పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ సుధాకర్,డి.ఈ ఫణిభూషణరావును అడిగి తెలుసుకున్నారు. ఈఎన్సీ మారయ్య చెప్పిన విధంగా ఇసుక బస్తాలతో క్రాస్ బాండ్ వేసి,నున్నటి గ్రావెల్ తో ఫిల్ చేసి ప్యాకింగ్ చేసే పనులు పూర్తి అయ్యాయి అని రెండు రోజులు అబ్జర్వేషన్ లో ఉండాలని కమిషనర్ ఏ.భాను ప్రతాప్,కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబుకు తెలిపారు.