మహిళల ఆర్థిక స్వాలంబనకు తోడ్పాటు అందించండి
1 min read
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించి వారి ఆర్థిక స్వాలంబనకు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మెప్మా, మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో 2025-26 ఆర్థిక సంవత్సర మహిళల వ్యవస్థాపకత కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెప్మా పిడి నాగశివలీల, పరిశ్రమల శాఖ జిఎం జవహర్ బాబు, మున్సిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వాలంబనకు తోడ్పాటునిచ్చి ప్రోత్సహించాలన్నారు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా చేయూత నిస్తోందన్నారు. జిల్లాలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఫుడ్ సర్వీసెస్, రెంటల్ షాప్స్, సర్వీస్ సెక్టార్ క్రింద 334 యూనిట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ఇందులో జిల్లా కేటాయించిన 1747 యూనిట్ల నెలకొల్పనకు మెప్మా అధికారులు, మున్సిపల్ కమీషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. స్వయం సహాయ సంఘాల మహిళల ఉత్పత్తులను ఎప్పటికప్పుడు ఓఎన్డిసి సైట్ లో అప్లోడ్ చేయాలన్నారు. నంద్యాల జిల్లా అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే విధంగా ఉత్పత్తులను తయారు చేసేలా మహిళలను ప్రోత్సహించాలన్నారు. అదే విధంగా అన్ని మున్సిపల్ ఏరియాల్లో మున్సిపల్, మెప్మా సహకారంతో కలంకారీ క్లాత్ తెప్పించి మహిళలకు నైటీలు, పెట్టికోట్స్ శిక్షణ ఇవ్వడం ద్వారా ఎక్కువ శాతం మహిళలకు ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయన్నారు. మెప్మా, తృప్తి క్యాంటీన్ వారి సహకారంతో త్వరలో తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో కలెక్టరేట్, అన్ని మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు బ్యాంకర్లు రుణాలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు.అనంతరం ఓఎన్డిసి సైట్ లో స్వయం సహాయక సంఘాల మహిళలు విక్రయించే 961 ఉత్పత్తులను కలెక్టర్ ఆన్లైన్ లో పరిశీలించారు.