NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోళగుందలో పోషణ పక్వాడ కార్యక్రమం ఘనంగా ప్రారంభం

1 min read

– గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండల కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. మండల కేంద్రంలోని డిపి ఏపీ స్కూల్ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో మొత్తం 6 సెంటర్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సిడిపిఓ నర్సమ్మ, సూపర్వైజర్ శిభరాణి, ఈరమ్మలు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గర్భిణీలు మరియు బాలింతల ఆరోగ్యం కోసం సరైన పౌష్టికాహారం ఎంతో అవసరమని తెలిపారు. తల్లి ఆరోగ్యం బాగుంటేనే శిశువు ఆరోగ్యంగా పుడతాడని పేర్కొన్నారు. ఈ పోషణ పక్వాడ కార్యక్రమం ఏప్రిల్ 9వ తేదీ నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగుతుందని, ఈ కాలంలో గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య పరిరక్షణ, ఆహారపు అలవాట్లు, పిల్లల పెంపకం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణీలు, బాలింతలు తమ అనుభవాలను పంచుకుంటూ పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా తల్లి, శిశువుకు ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా గర్భిణీలకు అవసరమైన వైద్య సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో 6వ సెంటర్ హెచ్. లక్ష్మి, ఇతర అంగన్వాడీ వర్కర్లు, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోషణ పక్వాడ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆరోగ్యంపై చైతన్యం పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *