139వ మేడే ను ఘనంగా నిర్వహించాలి
1 min read
సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్
1886 మే1న పెద్ద ఎత్తున కార్మికులు పోరాడారు
ప్రపంచ కార్మికుల హక్కుల పోరాట దిక్సూచి మేడే
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఏలూరు ఏరియా ముఖ్య నాయకుల సమావేశం ఉప్పులూరి హేమ శంకర్ అధ్యక్షతన ఆర్.ఆర్.పేట స్ఫూర్తి భవన్ నందు జరిగినది. ఈ సందర్భంగా సిపిఐ ఏలూరు సమితి కార్యదర్శి ఉప్పులూరు హేమ శంకర్ మాట్లాడుతూ అమెరికా,చికాగో నగరం,హే మార్కెట్ లో కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్‌లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. కార్మికులు తమ హక్కుల కోసం జరిపిన పోరాటానికి గుర్తుగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల హక్కుల కోసం ఉద్యమించే దిక్సూచిలా మారిన మే మొదటి తారీకు మేడేగా జరుపుకుంటున్నారని తెలిపారు.మన దేశంలో బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లు చేస్తూ అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వాడవాడలా ఎర్ర జెండాలు ఎగురవేసి మేడే ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.సిపిఐ ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్ మాట్లాడుతూ 139 సంవత్సరాలుగా కార్మికులు తన హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న వారికి సంఘీభావం తెలియజేస్తూ వారు జరిపే ఉద్యమాలకు భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.సిపిఐ ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యురాలు మావూరి విజయ మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి శాఖలోను జెండాలు ఎగురవేసి ఉదయం 10 గంటలకు సిపిఐ జిల్లా కార్యాలయం స్పూర్తి భవన్ వద్ద జరిగే జెండా ఆవిష్కరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు నాయకులు కొండేటి రాంబాబు, శాయన అభిలాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.