NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నెల‌లోనే ఆర్నెల్ల అప్పు చేసిన ఏపీ ప్రభుత్వం !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరంలో తొలి నెల‌లోనే రాష్ట్ర ప్రభుత్వం 19,717 కోట్ల అప్పును స‌మీక‌రించుకుని ఖ‌ర్చు చేసింది. ఏడాది మొత్తం మీద 37,079 కోట్ల రుణంగా బ‌డ్జెట్లో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో 53.18 శాతం తొలి నెల‌లోనే ప్రభుత్వం తీసుకుంద‌ని కాగ్ ప‌రిశీల‌న‌లో తేల్చింది. అంటే ఆర్నెల్ల అప్పును ఒక నెల‌లోనే ఏపీ ప్రభుత్వం చేసింది. గ‌త ఏడాది అది 34.57 శాతంగా ఉంది. కాగ్ ప్రతి నెల ప్రభుత్వ లెక్కల‌ను ప‌రిశీలిస్తుంది. ఎంత ఆదాయం వ‌చ్చింది, ఎంత అప్పు చేసింది, రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు ఎంతెంత అనేది తేలుస్తుంది. నెల‌నెల కాగ్ విడుద‌ల చేసే లెక్కల‌నే నిక‌ర రుణ‌ప‌రిమితి ప‌రిశీల‌న‌కు ప్రాతిప‌దిక‌గా తీసుకుంటామ‌ని కేంద్రం కూడ ఇప్పటికే స్పష్టం చేసింది.

About Author