నల్లపాడు సిఐ, ఎస్ ఐ ని తక్షణం విదుల నుండి తొలగించాలి!
1 min read
నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ డిమాండ్…
విజయవాడ, న్యూస్ నేడు: తనపై అక్రమ అరెస్టుకు పాల్పడిన గుంటూరు జిల్లా ఎస్ పి సతీష్, నల్లపాడు సిఐ వంశీధర్, ఎస్ ఐ లను తక్షణం విదుల నుండి తొలగించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తనను అక్రమంగా నిర్బంధించి నగదు చెక్కులు డిమాండ్ చేశారని ఆరోపిస్టూ బుధవారం, గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయంలో పోలీసు వ్యవస్థ అక్రమ అరెస్టులు చేస్తుందని, నల్లపాడు ఎస్ ఐ తనను పిలిచారని పోలీస్ స్టేషన్ కు పిలిపించుకొని తనను అక్రమంగా అరెస్టుచేసి నిర్బంధించి లక్షలరూపాయలు డిమండ్ చేశారని ఆరోపించారు.గతంలో తాను 30 లక్షలకు సొంత స్థలం బేరంపెట్టగా కొనుగోలుదారు 3లక్షలు అడ్వాన్స్ ఇవ్వగా అతనిని పిలిపించి తనపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. తనవద్దనున్న 2 ఏ టీ ఎమ్ కార్డులు కూడా లాక్కుని నాలుగు లక్షల 50 వేలు నగదు తీసుకున్నారన్నారు. వచ్చేనెలకు గాను ఐదు లక్షలకు 2 పోస్ట్ డేటెడ్ చెక్కులు తీసుకున్నారని పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలదించుకునేలా పనిచేస్తుందని ఆవేదన వ్యక్తపరిచారు. అదేమనడిగితే హోమ్ మినిస్టర్ అనితకు తాము నెలనెలా ముడుపులు చెల్లించాలని పోలీసులు వ్యక్తపరిచినట్టు స్పష్టం చేశారు. ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి పోలీసు వ్యవస్థపై చర్యలు తీసుకోవాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి జాతీయ నాయకుడిగా ఎన్నికలలో రెండు మూడుసార్లు పాల్గొన్న తనపై పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుందని పాలనలో పారదర్శకతలేదని షేక్ జలీల్ అభిప్రాయపడ్డారు.అన్యాయంగా పోలీసులు తనపై పెట్టిన కేసులు రద్దుచేయాలన్నారు. పోలీసులు తనపై జరిపిన జులుంకు ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఇటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటాని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. తక్షణం స్పందించి గుంటూరు జిల్లా ఎస్ పి సతీష్, నల్లపాడు సిఐ వంశీధర్, ఎస్ ఐ లపై కఠిన చర్యలు తీసుకుని విదుల నుండి తొలగించాలని షేక్ జలీల్ డిమాండ్ చేశారు.